- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC Tunnel Incident : సొంత జిల్లాలో ప్రమాదం జరిగితే రేవంత్ రాలేదేంటీ : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మరోసారి విరుచుకు పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మరోసారి విరుచుకు పడ్డారు. తన సొంత జిల్లాలో ప్రమాదం జరిగితే ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘటనా స్థలాన్ని ఎందుకు సందర్శించలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాద స్థలాన్ని సందర్శించే బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ టూర్లకు ఉన్న సమయం టన్నెల్ వద్దకు వెళ్ళడానికి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారు ఏమీ చేయలేక, వారి తప్పును కప్పిపుచ్చుకోడానికి విపక్ష నేతలపై ఎదురు దాడి చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. తాము ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయాలి అనుకుంటే.. ఘటన జరిగిన రోజే టన్నెల్ వద్దకు వచ్చి ఉండేవారమని, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని మేము రాలేదని అన్నారు. ఇదొక అనుకోని ప్రమాదం అని తమకు తెలుసని, అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది వేరని, ప్రమాదం జరిగి వారం రోజులు గడిచినా తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదని.. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు అంటే అంత లెక్కలేనితనం ఎందుకని ఆయన నిలదీశారు. టన్నెల్ లో నీళ్ళు వస్తున్నాయని చెప్పినా.. బలవంతం చేసి కార్మికులను లోపలికి పంపించారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.






