- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో రేవంత్ మ్యాజిక్.. ప్రచారం చోసి చోట్ల ఫలితం ఇదే
కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు, తెలంగాణ మోడల్ ప్రచారం ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 99, ఎల్‍డీఎఫ్ 39, ఎన్డీయే కూటమి 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ విజయం వెనుక కేవలం స్థానిక సమీకరణాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాహం గట్టిగా పని చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని భావించిన కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డిని దింపడంతో అక్కడ గేమ్‍ను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని ఆ ఫలితమే ఇవాళ్టి రిజల్ట్ లో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. కేరళలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి పనితీరు, ఆయన ప్రచార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రేవంత్ ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ జోరు:
ఏప్రిల్ 7వ తేదీన కోవళం, మావెళక్కర, పఠానాపురం, నేమోం వంటి కీలక నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. తాజా ఫలితాల్లో ఆయన ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఈసీ వెబ్ సైట్‍లోని ఫలితాల ప్రకారం కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి కుమార్ చమక్కల, కన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మోహన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మావెళక్కర నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి ఎం.ఎస్ అరుణ్ కుమార్, నేమోం నియోజకవర్గంలో రాజీవ్ చంద్ర శేఖర్ (బీజేపీ) ఆధిక్యంలో ప్రదర్శిస్తున్నారు. కేరళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన కొచ్చిలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షియాస్ ఆధిక్యంలో ఉండగా, సీపీఎం అభ్యర్థి కే.జే మ్యాక్సి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
మేనిఫెస్టోతో మొదలైన మార్పు
కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కేవలం ఒక స్టార్ క్యాంపెయినర్‌గానే కాకుండా, ఒక వ్యూహకర్తగా వ్యవహరించారు. కొచ్చిలో యూడీఎఫ్ మేనిఫెస్టోను వి.డి. సతీశన్‌తో కలిసి రేవంత్ రెడ్డి విడుదల చేయడం ఒక కీలక మలుపుగా మారింది. తెలంగాణ మోడల్‍ను చూపిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను కేరళ ప్రజలకు రేవంత్ రెడ్డి వివరించారు. దీంతో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ఎల్‍డీఎఫ్ (LDF) కోటను బద్దలు కొట్టడంలో రేవంత్ రెడ్డి అనుసరించిన దూకుడు వైఖరి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కేరళ సీఎం పినరయి విజయన్ తో రేవంత్ రెడ్డి లెటర్ వార్ కు దిగడం, మేము ప్రకటించిన గ్యారెంటీలపై అనుమానాలు ఉంటే తెలంగాణకు వచ్చి చూడాలంటూ సవాల్ విసరడం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారింది.






