రేవంత్.. తుపాకీ వెంకట్రావులా మభ్యపెడుతుండు: ఎర్రబెల్లి దయాకర్‌రావు సెటైర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 04:52:10  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తుపాకీ వెంకట్రావులా మభ్యపెడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటైర్లు వేశారు.

రేవంత్.. తుపాకీ వెంకట్రావులా మభ్యపెడుతుండు: ఎర్రబెల్లి దయాకర్‌రావు సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తుపాకీ వెంకట్రావులా మభ్యపెడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటైర్లు వేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో ప్రచారంలో పాల్గొన్న ఇయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా మోసపూరిత హామీలతో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలు మానుకోవాలని అన్నారు. బీజేపీ (BJP)తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని.. అందుకే మంత్రులు భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నా కమలనాధులు అసలు నోరెత్తడం లేదని కామెంట్ చేశారు. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిందని, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారని అన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ (Real Estate) కుప్పకూలి ఆర్థికంగా అంతా కుదేలయ్యారని ఫైర్ అయ్యారు. చివరకు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేడని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

Next Story