- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ప్రభుత్వం విజన్‌తో ముందుకెళ్తోంది.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు
‘తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit-2025) వైభవోపేతంగా ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit-2025) వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీనటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) మాట్లాడుతూ.. వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోందని.. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో ముందుకు వెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.






