- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వానాకాలం పంట సాగు పనులు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వానాకాలం పంట సాగు పనులు ప్రారంభమయ్యాయి. అయితే, పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. తమ వంతు వచ్చేదెన్నడో.. యూరియా చేతికొచ్చేది ఎన్నడోనని చింత చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల పడిగాపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. విత్తనాలు వేసిన రైతులు ఎరువుల కోసం షాపుల ఎదుట నిరీక్షిస్తున్నారని ఆరోపించారు. సాగు పనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఒక్క బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యూలో ఉన్నోళ్లకు సైతం ఎరువుల బస్తాలు దొరక్కపోవడంతో చివరికి నిరాశతో వెనుదిరిగిపోతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విరివిగా దొరికిన ఎరువులు.. కాంగ్రెస్ హయాంలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్కపోవడం ముమ్మాటికీ రేవంత్ సర్కార్ వైఫల్యమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.






