Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు అక్కడే

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-06 13:46:14  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. నవంబర్‌ 11న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు అక్కడే
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. నవంబర్‌ 11న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్‌ 14న రిజల్ట్స్ రానున్నాయి. జూబ్లీహిల్స్‌ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్(Returning Officer RV Karnan) మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. కొత్తగా ఓట్ల నమోదుకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం. నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అధికారులకు అందరూ సహకరించాలి అని రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ కోరారు.

Next Story