- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మేము 30 ఏళ్లుగా అవస్థలు పడ్డాం.. మీరొచ్చి కాపాడారు’.. హైడ్రాపై ప్రశంసలు
శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో చెరువును కాపాడిన హైడ్రాను ప్రశాంతి హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అభినందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో చెరువును కాపాడిన హైడ్రాను ప్రశాంతి హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అభినందించింది. అప్పటికే కొంత ఆక్రమణలకు గురి కాగా.. ప్రస్తుతం 29 గుంటలుగా మిగిలిన కుమ్మరి కుంటను కాపాడడంలో హైడ్రా చొరవను కొనియాడింది. తాము వినతి పత్రం అందించిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి... కుమ్మరికుంట పరిరక్షణకు చర్యలు తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను అభినందించింది. కాలనీ ప్రతినిధులు శనివారం హైడ్రా కమిషనర్‌ను కలిసి శాలువతో సత్కరించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో చెరువు హద్దులు నిర్ధారించడంతో తాము అంతా కలిసి కంచే వేసుకోవడానికి వెసులుబాటు లభించిందని అన్నారు.
గత 30 ఏళ్లుగా ఈ కుంటను కాపాడుకోవడానికి చాలా అవస్థలు పడ్డామని.. గత ఐదేళ్లుగా రాత్రీ పగలు కాపలా కాయాల్సి వచ్చిందని అన్నారు. హైడ్రా సమర్థ నిర్ణయం, సత్వర చర్యల వల్ల 3600 చ.గ. అడుగులు (సుమారు 100 కోట్ల రూపాయల విలువ గల) ప్రభుత్వ భూమిని భూభక్షకుల నుంచి కాపాడడమైందన్నారు. చెరువుకు ప్రాణం పోయడమే కాదు.. ప్రశాంత్ హిల్స్ కాలనీ, సమీప ప్రాంతాలలో నివసిస్తున్న 5,000 మంది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇచ్చినట్టయ్యిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానికులు ముందుకు వచ్చి ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, రహదారులు కబ్జాకు గురి కాకుండా చూడాలన్నారు. కాలనీ వాసులకు హైడ్రా తోడ్పడుతుందని చెప్పారు.






