ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో CI

by Prasad Jukanti |

హైదరాబాద్ నాంపల్లి సైబర్ క్రైమ్ బ్యూరోలో ఏసీబీ దాడులు నిర్వహించింది. బాధితుడి నుండి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ మహేందర్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో CI
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటున్నా పలువురు అధికారుల్లో మార్పు రావడం లేదు. మాకు చెప్పేదెవరూ? అమ్మల్ని అడ్డుకునేదెవరు అనే రీతిలో లంచాలకు మరుగుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. ఇవాళ నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రెయిడ్‍లో ఓ బాధితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) మహేందర్ ఏసీబీ వలకు చిక్కారు.

అదుపులోకి తీసుకుని విచారణ:

కార్యాలయంలోనే సీఐ మహేందర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి సైబర్ క్రైమ్ కార్యాలయంలోనే సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న సీఐ మహేందర్ బాధితులు ఇంకెంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. గతంలో ఎవరెవరి దగ్గర నుండి ఇలా వసూళ్లకు పాల్పడ్డారు? ఈ కేసులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీఐ మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నట్లు సమాచారం.

Next Story