మూడు నెలలుగా వేతనాలు లేవు...పీఆర్​, ఆర్​డీ డైరెక్టర్​కు వినతి

by velandi.Saikiran |

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని

మూడు నెలలుగా వేతనాలు లేవు...పీఆర్​, ఆర్​డీ డైరెక్టర్​కు వినతి
X

మూడు నెలలుగా వేతనాలు లేవు

పీఆర్​, ఆర్​డీ డైరెక్టర్​కు వినతి

ఉపాధి హామీ ఉద్యోగుల జాయింట్​ యాక్షన్​ కమిటీ వినతి

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతూ పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్​ సృజనకు ఉపాధి హామీ ఉద్యోగుల జాయింట్​ యాక్షన్​ కమిటీ వినతి పత్రం సమర్పించింది. బుధవారం ఆమెను కలిసిన జేఏసీ చైర్మన్​ ఎలబద్రి లింగయ్య, కోచైర్మన్​ వెంకట్రాంరెడ్డి, అంజిరెడ్డి, విజయ్​ కుమార్​ లు వేతనాలు వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు.

గతంలోనూ ఉపాధి హామీ ఉద్యోగ సంఘాలు పలుమార్లు అధికారులను కలిసి వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరితే ఏవో సాకులు చెబుతున్నారని, స్పర్శ సాఫ్ట్వేర్ పేరు చెప్పి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి గత మూడు నెలలుగా దాటవేస్తూ వస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం రూ.12వేల మంది ఉపాధి ఉద్యోగులు జీతాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. వేతనం రాలేదని ఏపీవో మానసిక వేదనకు గురై మరణించాలరని, చాలా మంది ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని వారు తెలిపారు. ఆడ్మిన్​ బిల్లులు కూడా ఇవ్వడంలేదని తెలిపారు. గతంలో సీఎం రేవంత్​రెడ్డి తమకు పే స్కేల్​ అమలు చేస్తామని చెప్పారని కానీ ఇంత వరకు పేస్కేల్​ అమలు చేయడంలేదన్నారు.

Next Story