TG News : కాళేశ్వరంపై నివేదిక సిద్ధం!

by Muthe.Rajitha |

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అవకతవకలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(PC Ghosh Commission) నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.

TG News : కాళేశ్వరంపై నివేదిక సిద్ధం!
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(PC Ghosh Commission) నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. నివేదికను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ కమిషన్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ సమస్యలు, టెండరింగ్ ప్రక్రియలో అక్రమాలు, నిధుల సమీకరణలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో ఇప్పటి వరకు 115 మందిని ప్రశ్నించి, వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.

వీరిలో ఇరిగేషన్ అధికారులతోపాటు, కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి బడా నేతలు కూడా ఉన్నారు. అలాగే ఇటీవల ప్రభుత్వం అందించిన కేబినెట్ మినిట్స్ ను కూడా నివేదికలో కలపి జులై ఆఖరికి నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదిక అందిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు, బ్యారేజీల మరమ్మతులు, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story