పది రోజుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై నివేదిక ఇవ్వాలి : హైకోర్టు

by Muthe.Rajitha |

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యార్ధుల వసతి గృహలలో చోటుచేస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై 10 రోజులలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పది రోజుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై నివేదిక ఇవ్వాలి : హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యార్ధుల వసతి గృహలలో చోటుచేస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై 10 రోజులలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై అడ్వకేట్ చిక్కడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం హై కోర్టు విచారించింది. నవంబర్ నెలలో నారాయణ పేట, మాగనూరు , బురుగుపల్లి వసతి గృహలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై చిక్కుడు ప్రభాకర్ పిల్ దాఖలు చేశారు. 6 వారాలలో నివేదికలు సమర్పిచాలని హైకోర్టు డిసెంబర్ 5వ తేదిన ఆదేశించిన 8వారాలు గడుస్తున్న రాష్ర్ట ప్రభుత్వం నివేదిక సమర్పించలేదని ప్రభాకర్ కోర్టుకు వివరించారు. వాదనలు పరిశీలించిన హైకోర్టు 10 రోజులు నివేదిలకలు ఇవ్వాలని ఆదేశాలు చేస్తూ . తదుపరి విచారణ 18వ తేదికి వాయిదా వేసింది.

Next Story