- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూతపడ్డ స్కూల్స్‌కు విద్యారంగంలో నూతన ఊపిరి
ప్రైవేట్‌తో పోటీని తట్టుకోలేక విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. కష్టమైన, నాణ్యమైన విద్య అం దించాలనే

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రైవేట్‌తో పోటీని తట్టుకోలేక విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. కష్టమైన, నాణ్యమైన విద్య అందించాలనే పట్టణాల్లోని ప్రైవేట్ స్కూల్స్‌కు పంపిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. ఈ స్కూల్స్‌కు పూర్వ వైభవం తీసుకరావాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీఈవోలు టీచర్లతో కలిసి పక్కా ప్రణాళి కతో ముందుకెళ్తున్నారు. గ్రామస్తుల సా యంతో యువతను కలుపుకొని ప్రభుత్వ స్కూల్స్‌పై తల్లిదండ్రులకు అవగాహన క ల్పించారు. ఇప్పుడు మూతపడిన స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో కళకళ లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పరిధిలో కూడా స్కూల్స్ ప్రారంభించాలని దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది.
జిల్లాలో 27 స్కూల్స్ రీ ఓపెనింగ్..
రంగారెడ్డి జిల్లాలో 1309 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ప్రైమరీ 880, అప్పర్ ప్రైమరీ 180, హైస్కూల్స్ 249 చొప్పున ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 27 ప్రైమరీ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య జీరో కావడంతో మూతపడటం జరిగిం ది. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో ప్రభు త్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్, విద్యాధికారులు కలిసి మూతపడిన స్కూల్స్ తిరిగి తెరిపించేందుకు తీవ్ర కృషి చేశారు. మూతపడిన స్కూల్స్‌కు మొదటగా టీచర్ల ను కేటాయించి, ఆ తర్వాత పూర్తి స్థాయి లో డిప్యూటేషన్ కల్పిస్తూ నిర్ణయాలు తీ సుకున్నారు. దీంతో ఆ 27 స్కూల్స్‌లో సుమారు 250 మంది విద్యార్థులను చేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడాదిలో 1244 స్కూల్స్‌కు 1,38,000 మంది ఉన్నారు. 1309 స్కూల్స్‌కు 1,46,000 మంది విద్యార్థుల సంఖ్య పెంచినట్లు వెల్లడిస్తున్నారు. షాబాద్ మం డలం, ముచ్చింతల్‌లోని ప్రైమరీ స్కూల్స్‌లో విద్యార్థుల లేకపోవడంతో మూతపడింది. మంచాల మండలం, ఎల్లమ్మతండాలో ప్రవేశం లేక మూతపడింది. ఈ ఏ డాది విద్యాధికారులు, కలెక్టర్ నిఘాతో విద్యావంతులు, యువత ముందుకచ్చి ప్ర భుత్వ స్కూల్స్‌కు రంగులు దిద్ది సంఖ్య పెంచి స్కూల్స్ కాపాడుకున్నారు.
త్వరలో గ్రామానికో స్కూల్..
ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజ లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్ స్కూల్స్‌కే అధిక ప్రాధాన్యతిస్తూ గత ప్రభుత్వాలు నిర్ణ యాలు తీసుకున్నాయి. కానీ కాం గ్రెస్ ప్రభుత్వం కొత్త పంథలో ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధికి శ్రీకా రం చూట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారం భించే స్కూల్స్‌కు ఈ ఏడాది చివ రలో టీచర్ల నియమాకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
10 వేల మంది విద్యార్థుల చేరికే లక్ష్యం : సుశీంధర్ రావు, జిల్లా విద్యాశాఖాధికారి, రంగారెడ్డి
ప్రభుత్వ ఆదేశాలతో మూతపడ్డ స్కూల్స్ రీఓపెనింగ్ చేశాం. 27 స్కూల్స్ రీ ఓపెనింగ్ చేసి 250 మంది కొత్తగా చేర్చుకున్నాం. వీటితో పాటు రన్నింగ్లోని స్కూల్స్‌లో మొత్తంగా 10 వేల మందిని చేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి కూడా దగ్గరలోనే ఉన్నాం. ఆగస్ట్ నాటికి ఆ సంఖ్య పూర్తి చేస్తాం. స్థానిక గ్రామస్తులతో పాటు విద్యావంతులు, యువత మా టీచర్లకు పూర్తిగా సహకరించారు. అందరి కృషితోనే విద్యార్థుల సంఖ్య పెంచుతున్నాం.






