ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండటం సిగ్గుచేటు: రేణుకాచౌదరి

by Ajay Maddhiboyina |

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ దూరంగా ఉండ‌టం సిగ్గుచేటు అని ఎంపీ రేణుకా చౌద‌రి విమ‌ర్శించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి, తెలంగాణ నుండి ఉన్నత స్థానానికి పోటీ చేస్తున్న ఓ తెలుగు వ్య‌క్తికి అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త బీఆర్ఎస్‌కు లేదా అని ప్రశ్నించారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండటం సిగ్గుచేటు: రేణుకాచౌదరి
X

దిశ, వెబ్ డెస్క్: ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ దూరంగా ఉండ‌టం సిగ్గుచేటు అని ఎంపీ రేణుకా చౌద‌రి విమ‌ర్శించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి, తెలంగాణ నుండి ఉన్నత స్థానానికి పోటీ చేస్తున్న ఓ తెలుగు వ్య‌క్తికి అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త బీఆర్ఎస్‌కు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అందుకే ఎన్నికకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు.

తమ ఎంపీలు అంతా సుదర్శన్ రెడ్డికే ఓటు వేస్తున్నారని తెలిపారు. గెలుపు ఓటములు తరవాత అని తాము మాత్రం ఆయనకే ఓటు వేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. చివర్లో అద్భుతం జరుగుతుందని అన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగి ఇండియా కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్థి గెలిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అభ్యర్థి గెలవాలి అనేదే మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పారు.

Next Story