- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతల స్వీకరణ.. స్పీకర్ అభినందనలు
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శాసనసభ కార్యదర్శిగా సేవలందించిన వి. నరసింహాచార్యులు నుండి ఆయన అసెంబ్లీలోని కార్యదర్శి ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యదర్శి తిరుపతి, శాసన మండలి కార్యదర్శి వి. నరసింహాచార్యులు కలిసి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నూతన కార్యదర్శి తిరుపతికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇప్పటివరకు అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న వి. నరసింహాచార్యులు ఇకపై శాసన మండలి కార్యదర్శిగా తన సేవలను కొనసాగించనున్నారు.
Next Story






