- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ గుర్తు పెట్టుకో.. అధికారం ఎవరికి శాశ్వతం కాదు
ప్రజా స్వామాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులా..? రేవంత్ రెడ్డి చేసే లేకి రాజకీయానికి ఇదే నిదర్శనమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : ప్రజాస్వామాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులా..? రేవంత్ రెడ్డి చేసే లేకి రాజకీయానికి ఇదే నిదర్శనమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.బీజేపీ,కాంగ్రెస్ లు మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని,బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందన్నారు. కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలిచినా అధికార దాహంతో సీఎం,మంత్రి వివేక్ సూచనలకు అనుగుణంగా అధికారులు తొత్తులుగా మారి ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.మరికొన్ని మున్సిపాలిటీలలోనూ ఇదే రీతిన వ్యవహరించారన్నారు.మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించినా కనీసం మంత్రి వివేక్ స్పందించకాపోవడం సిగ్గు చేటన్నారు.
వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు..?
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైల్లో ఉంచారని.. అదే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను తిట్టినా ఎందుకు కేసులు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. స్పష్టమైన మెజారిటీ వచ్చినా ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మా కార్యకర్తలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చినా మా కౌన్సిలర్లు లొంగలేదన్నారు.గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని ప్రశ్నించారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.రేవంత్ గుర్తు పెట్టుకో..అధికారం ఎవరికి శాశ్వతం కాదని..అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న,ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, గంగుల కమలాకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.






