- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Remand: ఈఎన్సీ హరిరామ్‌కు రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఏసీబీ అధికారులు (ACB Officials) కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ (Bhukya Hariram)పై శనివారం కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఏసీబీ అధికారులు (ACB Officials) కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ (Bhukya Hariram)పై శనివారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు అర్ధరాత్రి ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజల పాటు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించారు. దీంతో హరిరామ్‌ను పోలీసులు నేరుగా అక్కడి నుంచి చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు హరిరామ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో ఏక కాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు ఆయన పేరు మీద రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు.
అందులో మర్కూక్ (Markook) మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదేవిధంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati)లో విలువైన స్థలం ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని షేక్‌పేట్, కొండాపూర్ ప్రాంతాల్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్‌కాలనీ, నార్సింగ్ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయి. పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. బొమ్మలరామారం (Bommalaramaram)లో 6 ఎకరాల్లో ఫామ్‌హౌజ్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ (BMW) సహా రెండు కార్లు, విలువైన బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.






