- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smita Sabharwal: కాళేశ్వరం కేసులో స్మితా సబర్వాల్ కు హైకోర్టులో రిలీఫ్
by Prasad Jukanti |
స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‍కు (Smita Sabharwal) హైకోర్టులో (High Court) ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. స్మితా సబర్వాల్ పిటిషన్ ను ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవలక వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Next Story






