గిరిజన రైతులకు హైకోర్టులో భారీ ఊరట

by Muthe.Rajitha |

ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది.

గిరిజన రైతులకు హైకోర్టులో భారీ ఊరట
X

దిశ తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. భూ సంబంధిత వివాదంలో హైకోర్టు దాఖలైన రిట్ పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం స్టేటస్ క్వో ఆదేశాలు జారీ చేసిన ఆర్డర్ కాపీ మంగళవారం ఇచ్చింది. జూన్ 24లోగా పిటిషన్లు ఎందుకు స్వీకరించకూడదో వివరణ ఇవ్వాలని ప్రతి వాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారంకు చెందిన గిరిజన రైతులు ఇస్లావత్ జమునా , ఇస్లావత్ బాలా తమ వ్యవసాయ భూములపై అటవిశాఖ, పోలీసు అధికారులు అన్యాయంగా బెదిరిస్తున్నారని, భూముల నుంచి బలవంతంగా తమను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. పిటిషనర్ల తరపున అడ్వకేట్ నల్లపు మణీదిప్ వాదనలు వినిపించారు.

పిటిషనర్లకు అటవీశాఖ ద్వారా మంజూరైన ఫారెస్ట్ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ( ఆర్వోఎఫ్ఆర్) పత్రాల ఆధారంగా భూములు ఉన్నాయని, అధికారుల బెదిరింపులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని వారు కోర్టులో వాదించారు. మే మొదటి వారంలో విచారణ జరగగా మంగళవారం ఆర్డర్ కాపీ హైకోర్టు విడుదల చేసింది. పిటిషనర్లకు చెందిన 9.30 ఎకరాలు , 6.71 ఎకరాల భూములపై ప్రస్తుతం ఉన్న యథాస్థతి కొనసాగించాలని జస్టీస్ పుల్లా కార్తీక్ స్పష్టం చేస్తూ స్టేటస్ క్వో ఆదేశాలను జారీ చేశారు . ప్రతి వాదులుగా పేర్కోన్న అటవిశాఖ, హోంశాఖ అధికార ప్రతినిధులకు , ప్రభుత్వ న్యాయవాదులకు ఇది వరకు నోటీసులను స్వీకరించినందున, పునఃనోటీసు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కోంది. పిటిషన్లను ఎందుకు స్వీకరించకుడదో వివరణ ఇవ్వాలన ప్రతి వాదులైప అటవీశాఖ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరికి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

Next Story