- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట
తనపై నమోదైన నాలుగు కేసులు కొట్టేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తనపై నమోదైన నాలుగు కేసులు కొట్టేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు(Telangana High Court).. తదుపరి విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆ కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు.. కోర్టుకు హాజరు నుంచి బండి సంజయ్‌కు మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. కాగా, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే మిగిలిన కేసులను కూడా కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.






