ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

by Disha Web Desk 2 |
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2023 టెన్త్, ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. గురువారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ మాత్రం మే 12 నుంచి 19 జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల టైమింగ్స్ మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అని పేర్కొన్నారు. వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్ నుంచి టీఓఎస్ఎస్ పరీక్షల టైమ్ టేబుల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



Next Story