TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షకు 3,760 మంది అర్హత

by Prasad Jukanti |   (  Updated:2026-02-18 06:18:33  IST  )

టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌ రాత పరీక్షకు ఎంపికైన వారి జాబితాను అధికారులు విడుదల చేశారు. పరీక్ష తేదీలను సైతం వెల్లడించారు.

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షకు 3,760 మంది అర్హత
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (TGFSL)లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) కీలక అప్‌డేట్ జారీ చేసింది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షకు 3,760 మంది అర్హత సాధించినట్లు టీఎస్ఎల్‍పీఆర్‍బీ వెల్లడించింది. సైంటిఫిక్‌ ఆఫీసర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ విభాగాల్లో మొత్తం 60 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‍లో నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇవాళ్టి నుంచే అవకాశం:

వీటికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం 37600 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. రాత పరీక్షకు అర్హత సాధించిన వారికి మార్చి 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పోస్టుల వారీగా రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా www.tgprb.in అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. ఈ రాత పరీక్షకు అర్హత పొందని అభ్యర్థులెవరైనా ఈ విషయంలో స్పష్టత కోరాలని భావిస్తే www.tgprb.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ కు అవకాశం కల్పించారు. స్పష్టత కోసం ప్రతి పోస్టుకు రూ. 500 ఆన్‍లైన్‍లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ అవకాశం 18 ఫిబ్రవరి ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 21 ఉదయం 8 గంటల వరకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Next Story