నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం డాక్టర్ కాళ్ళు మొక్కిన రోగి బంధువులు.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. వైద్యం కోసం వెళితే వెంటిలేట‌ర్ ఖాళీగా లేదంటూ డాక్ట‌ర్ స‌మాధానం ఇచ్చింది.

నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం డాక్టర్ కాళ్ళు మొక్కిన రోగి బంధువులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. వైద్యం కోసం వెళితే వెంటిలేట‌ర్ ఖాళీగా లేదంటూ డాక్ట‌ర్ స‌మాధానం ఇచ్చింది. అడ్మిట్ చేసుకోలేమ‌ని వెంటిలేట‌ర్లు ఒక్క‌టి కూడా ఖాళీగా లేవ‌ని చెప్పింది. వేరే ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని సూచించింది. దీంతో త‌మకు ఏమీ తెలియ‌ద‌ని ద‌య‌చేసి వెంటిలేట‌ర్ ఏర్పాటు చేయాల‌ని రోగి బంధువులు డాక్ట‌ర్ కాళ్లు ప‌ట్టుకున్నారు. అయినా త‌న‌ను ముట్టుకోవ‌ద్దు అంటూ డాక్ట‌ర్ స‌మాధానం ఇచ్చింది. క‌ల్వ‌కుర్తి నుండి హైద‌రాబాద్ కు వ‌చ్చామ‌ని త‌మ వ‌ద్ద‌ డ‌బ్బులు లేవ‌నే నిమ్స్ కు వ‌చ్చామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇంత‌పెద్ద ఆస్ప‌త్రిలోనే ఆక్సీజ‌న్ అందుబాటులో లేక‌పోతే మ‌రెక్క‌డికి వెళ‌తామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వీడియో రికార్డ్ చేసిన వ్య‌క్తి మ‌న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఎక్క‌డ‌కు వెళ్లినా మ‌నిషి బ్ర‌తుకుతాడు అనే గ్యారెంటీ లేద‌న్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ద‌య‌చేసి ఆస్ప‌త్రుల‌ను ప‌ట్టించుకోవాల‌న్నారు. రాత్రి 2గంట‌ల‌కు హార్ట్ స్ట్రోక్ వ‌చ్చిన వ్య‌క్తిని తీసుకుని వెళితే 2.30 నిమిషాల వ‌ర‌కు పేషెంట్ ను ప‌ట్టించుకోలేద‌న్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి నిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించాల‌న్నారు. పేద‌లు బ‌త‌కాలి అంటే ముందు ఆస్ప‌త్రుల‌ను పట్టించుకోవాల‌న్నారు.

Next Story