- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Insta Reels: రేయ్ ఎవర్రా మీరంతా.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఇన్ స్టా రీల్స్
రీల్స్ పిచ్చి పీక్స్ చేరుతోంది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ చేయడం వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఫేమస్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా వీరి తీరు మాత్రం మారడం లేదు. అక్కడ ఇక్కడ రీల్స్ చేస్తే ఏమొస్తుందిలే అనుకున్నారో ఏమో కానీ కొంత మంది యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్నే ఎంచుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ ఆకతాయిల వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే లెక్క లేకుండా పోయింది, ముందు వీళ్లని బొక్కలో వేయండి సర్ అంటూ ఓ నెటిజన్స్ ఫైర్ కాగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరో యూజర్ రియాక్ట్ అవుతూ సర్ ఈ విషయంలో చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించండి అంటూ సిటీ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశాడు. మరి ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
https://x.com/TeluguScribe/status/1836965609902375390






