- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ పిచ్చికి నిండు ప్రాణం బలి HYDలో 14 ఏళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‍లో రీల్స్ చేస్తూ బాల్కనీ పిట్టగోడ నుంచి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అందరిని కలిచివేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వెర్రి చేష్టలు చేస్తుంటారు. రీల్స్ మోజులో పడి ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? అనే స్పృహను మరిచి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‍లో పీల్స్ పిచ్చి ఓ బాలుడి నిండు ప్రాణం బలి తీసుకుంది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని నాచారంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని బస్తీలో నివసించే కుటుంబానికి చెందిన బాలుడు మితున్ (14) సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు. తన స్నేహితులు ఎక్కువగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండటం చూసి తాను కూడా అలేగే రీల్స్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమలో బిల్డింగ్ రేలింగ్ పిట్ట గోడపై ఫీట్స్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అదుపుతప్పిన మితున్ నేరుగా బిల్డింగ్ కిద్దకు పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన మితిన్ ను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతు మితిన్ తుది శ్వాస విడిచాడు. అయితే బాలుడి కుటుంబం బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుంత వైరల్ గా మారింది.






