- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : కేసీఆర్ పాలనలో తగ్గిన మద్యపాన వినియోగం : హరీష్ రావు
కేసీఆర్ పాలన(KCR Government)లో తెలంగాణ(Telangana)లో మద్యం అమ్మకాలు తగ్గాయ(Alcohol Sales Down)ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS) నివేదిక స్పష్టం చేసిందని...రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారన్న కాంగ్రెస్, బీజేపీల(Congress And BJP)ది తప్పుడు ప్రచారం(Falsely Propagatedf)గా తేలిపోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) వెల్లడించారు

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్ పాలన(KCR Government)లో తెలంగాణ(Telangana)లో మద్యం అమ్మకాలు తగ్గాయ(Alcohol Sales Down)ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS) నివేదిక స్పష్టం చేసిందని...రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారన్న కాంగ్రెస్, బీజేపీల(Congress And BJP)ది తప్పుడు ప్రచారం(Falsely Propagatedf)గా తేలిపోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) వెల్లడించారు. రాజ్యసభలో వైద్య, ఆరోగ్య రాష్ట్ర మంత్రి అనూప్రియా పటేల్ సమర్పించిన అధికారిక డేటాను హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 4(2015-16) నివేదిక మేరకు తెలంగాణలో పురుషులు 53.3శాతం అల్కాహాల్ వినియోగిస్తే..మహిళలు 8.7శాతం వినియోగించినట్లుగా తెలిపారు. అలాగే ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్ 5(2019-21) నివేదిక మేరకు పురుషులు 50.0శాతం, మహిళలు 4.9శాతం ఆల్కాహాల్ వినియోగించినట్లుగా కేంద్రం వెల్లడించిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ రెండు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికలను విశ్లేషిస్తే కేసీఆర్ ప్రభుత్వ విధానాలు తెలంగాణలో మద్యపానానికి దారితీశాయనే వాదనకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతుదన్నారు. కేసీఆర్ పాలనా విధానాలతో మద్యపానం వినియోగం 3.8% తగ్గినట్లుగా నివేదికలు రుజువు చేశాయని హరీష్ రావు స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యపాన వినియోగం పెరిగిందన్న కాంగ్రెస్, బీజేపీలు విమర్శలకు ఎన్ఎఫ్ హెచ్ఎస్ నివేదికలే సమాధానమిచ్చాయని హరీష్ రావు గుర్తు చేశారు. ఇది కేసీఆర్ సమర్థవంతమైన పాలనకు నిలువెత్తు గణంకాల నిదర్శనమని పేర్కొన్నారు.
కాగా ఎన్ఎఫ్ హెచ్ ఎస్ 4((2015-16) నివేదికలో దేశంలోని మొత్తం 36 కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ పురుషులు ఎక్కువగా 59.0శాతం మేరకు ఆల్కాహాల్ వినియోగించారు. ఆ తర్వాత తెలంగాణ పురుషులు 53.8శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. మహిళల్లో కూడా అరుచల్ ప్రదేశ్ 26.3శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా..సిక్కిం 23.0శాతంతో రెండో స్థానంలో ఉంది.
ఇక ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్ 5(2019-21) నివేదిక మేరకు పురుషులు అత్యధికంగా ఆల్కాహాల్ వినియోగించిన జాబితాలో గోవా 59.1శాతంతో తొలి స్థానంలో ఉండగా..56.6శాతంతో అరుచల్ ప్రదేశ్ పురుషులు రెండో స్థానంలో నిలిచారు. మహిళల్లో అరుణాచల్ ప్రదేశ్ 17.8శాతంతో ప్రథమ స్థానం నిలబెట్టుకుంది. సిక్కిం మహిళలు యధావిధిగా 14.8శాతంతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.






