- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: మొన్న బ్లాక్, నేడు పింక్.. బీఆర్ఎస్ బుక్ పాలిటిక్స్ లో ఎవరికి వారే!
తెలంగాణలో 'బుక్' పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రెడ్ బుక్ (Red Book), బ్లాక్ బుక్ (Black Book) ఈ పదాలు పదే పదే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిసారి రెడ్ బుక్ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడేవారు. ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ అలాంటి హెచ్చరికలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమపై దౌర్జన్యం చేస్తున్న అధికారులు, పాలకుల పేర్లు బ్లాక్ బుక్ లో రాసుకుంటున్నామని ఈ కాన్సెప్ట్ ను మొదలు పెట్టగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్న వారందరి పేర్లు డైరీల్లో రాసుకుంటున్నామని హరీశ్ రావు, కేటీఆర్ బహిరంగంగానే హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై చర్చ జరుగుతుండగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించారు. ఇవాళ జనగామలో పర్యటించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కార్యకర్తలను వేధిస్తున్న వారిపైర్లను పింక్ బుక్ (Pink Book) లో రాసుకుంటున్నామన్నారు. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు.. మీ లెక్కలు తీస్తాం. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
చిన్న పోస్టు పెట్టిన సీఎం రేవంత్ భయపడుతున్నారు:
రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని కవిత విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఏ చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భయపడుతున్నారని పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం అన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు. నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001 లో ఆఘమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారన్నారు. 95 పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు.
ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ దే విజయం:
అవకాశవాదం కోసం కడియం శ్రీ హరి పార్టీ మారారని ఆయన్ను ప్రజలు క్షమించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముందన్నారు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని దీమా వ్యక్తం చేశారు. రూ 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు మాయమయ్యాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థతి ఉందని ఫీజు రియింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. రుణమాఫీ అందరికీ జరగకుండానే పూర్తయిందని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నదన్నారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడుతామన్నారు. తెలంగాణలో తిరిగి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ బుక్ పాలిటిక్స్ లో ఎవరికి వారే!:
కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ లో పాలకులు, అధికారుల తప్పొప్పులు ఎంట్రీ చేసుకుంటుండగా హరీశ్ రావు, కేటీఆర్ బుక్ కలర్ పేరు చెప్పకుండానే అందరి చిట్టాపద్దులు రాస్తున్నామన్నారు. ఇంతలో కవిత పింక్ బుక్ మెయింటెన్ చేస్తున్నామని చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. బుక్ ప్రస్తావన విషయంలో బీర్ఎస్ పార్టీలో ఎవరి దారి వారిదేనా? అందరూ ఒకే తాటిపై లేరా అనే చర్చ జరుగుతోంది.






