- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు
ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ట్రాన్స్ జెండర్లను (Transgenders) నియమించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో (Hyderabad Metro) సెక్యూరిటీ గార్డులుగా (Security Guards) వారిని నియమించింది. ఈ మేరకు ఇవాళ 20 మంది ట్రాన్స్ జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వం టాన్స్ జెండర్స్ కు ఆత్మగౌరవంతో కూడిన జీవితం అందిస్తుందని చెప్పారు. ట్రాన్స్ జెండర్లు సమాజంలో తక్కువేమి కాదని వారికీ తలెత్తుకుని జీవించే హక్కు ఉందని నిరూపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షమెత్తిన ట్రాన్స్ జెండర్స్ కు ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి ఆలోచనతోనే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో 20 మంది సెక్యూరిటీ గార్డులుగా నియమించిందని ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ పోస్టుల కోసం సుమారు 300-400 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేశామన్నారు. వారి భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






