లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్​ పదవుల భర్తీ

by Yella Dhawani Reddy |

మానవ హక్కుల కమిషన్​, లోకాయుక్తల నియామకానికి గవర్నర్​ ఆమోద ముద్రవేశారు.

లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్​ పదవుల భర్తీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మానవ హక్కుల కమిషన్​, లోకాయుక్తల నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma)​ ఆమోద ముద్ర వేశారు. లోకాయుక్తగా జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డి, మానవ హక్కుల కమిషన్​ ఛైర్మన్​గా జస్టిస్​ షమీమ్​ అక్తర్‌ను నియమించారు. మానవ హక్కుల కమిషన్​ సభ్యులుగా రమాదేవి, కిషోర్​ కుమార్​లను నియమించారు. వీరి నియామకానికి ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కమిటీ ఈ పేర్లను సూచించగా గవర్నర్​ ఆమోద ముద్ర వేశారు. జస్టిస్​ రాజశేఖర్​రెడ్డి ప్రస్తుతం రేరా అప్పిలెట్​ ట్రిబ్యునల్​ ఛైర్మన్​గా బాధ్యతల్లో ఉన్నారు. షమీమ్​ అక్తర్​ ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కమిషన్​ ఛైర్మన్​గా వ్యవహరించారు.

Next Story