KCR దత్తత గ్రామం వాసాలమర్రిలో రీకౌంటింగ్

by Gantepaka Srikanth |

KCR దత్తత గ్రామం వాసాలమర్రిలో రీకౌంటింగ్

KCR దత్తత గ్రామం వాసాలమర్రిలో రీకౌంటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) ఫలితం ఎటూ తేలడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు మళ్లీ రీకౌంటింగ్ మొదలు పెట్టారు. కాగా, ఈ గ్రామాన్ని 2020లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ (Congress)మద్దతుదారుల విజయం సాధిస్తున్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ అనుబంధ అభ్యర్థులే గెలుపొందడం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

Next Story