మేకల సంత తైబజార్‌ వేలానికి రికార్డ్ ధర

by Disha Web Desk 4 |
మేకల సంత తైబజార్‌ వేలానికి రికార్డ్ ధర
X

దిశ, నవీపేట్ : రాష్ట్రంలోనే పేరెన్నిక గల నవీపేట్ మేకల సంత తైబజార్ వేలం పాటలో రికార్డ్ ధర పలికింది. సోమవారం నాడు నిర్వహించిన తైబజార్ వేలం పాటలో 87 మంది ఔత్సాహికులు లక్ష రూపాయల డిపాజిట్ కట్టి వేలం పాటలో పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి సలీమ్ రూ.55 లక్షల 16 వేల రూపాయలతో మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు. గత సంవత్సరం రూ.33 లక్షల 70 వేలకు వేలం పాట కాగా ఈ సంవత్సరం రూ.21 లక్షల 46 వేల రూపాయలు అదనంగా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరింది.

వారాంతపు కూరగాయల మార్కెట్ తైబజార్ వేలం పాటలో మండల కేంద్రానికి చెందిన అయ్యవార్ సంతోష్ రూ.16 లక్షలకు వేలం పాట దక్కించుకున్నాడు. సులభ్ కాంప్లెక్స్, డాక్టర్ వాటర్ వేలం పాటలు వాయిదా పడ్డాయి. ఈ వేలంపాట కార్యక్రమంలో సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేష్, ఎంపీఓ రామకృష్ణ, కార్యదర్శి గంగాధర్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story