Global Summit: గ్లోబల్ సమ్మిట్‍ ఇన్వెస్ట్ మెంట్స్ @రూ.5,39,495 కోట్లు

by Prasad Jukanti |

పెట్టుబడుల సమీకరణలో సర్కార్ గ్రాండ్ సక్సెస్ అయింది.

Global Summit: గ్లోబల్ సమ్మిట్‍ ఇన్వెస్ట్ మెంట్స్ @రూ.5,39,495 కోట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ లో (Telangana Rising Global Summit 2025) పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గ్రాండ్ సక్సెస్ అయింది. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) వేదికగా నిన్న ఇవాళ రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్‍లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులను దక్కించుకుంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు, ఎంవోయూల రూపంలో ఈ పెట్టుబడులను సాధించుకోగలిగింది. గ్లోబల్ సమ్మిట్‍లో భాగంగా నిన్న (డిసెంబర్8) రూ.2,43,000 కోట్లు, ఇవాళ (డిసెంబర్ 9)న రూ.2,96,495 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్‍లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజన్ 2047 డాక్యుమెంట్ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను, సంస్థలను అమితంగా ఆకట్టుకుంది.

Next Story