రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి

by Malleboina Mahesh |

ఈ సంవత్సరం అన్ని కాలాలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచికొట్టగా, వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి.

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సంవత్సరం అన్ని కాలాలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచికొట్టగా, వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఈసారి నవంబర్ నెలలో గత ఏడు సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన ‘మోంతా తుఫాను’ ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిపోయింది.

అదే సమయంలో, వాతావరణ వ్యవస్థలో MJO (Madden-Julian Oscillation) అణచివేత దశలో ఉండటంతో రాబోయే 10–15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలి గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు “ఒక దశలో తీవ్రమైన వర్షాలు కురిస్తే, ఆ తర్వాతి దశలో పొడి వాతావరణం తప్పదనే పాఠం ఈ సీజన్ మనకు చెబుతోంది” అని ప్రజలు చలి ప్రభావానికి సిద్ధంగా ఉండాలని వారు సూచించారు.

Next Story