- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త కారు కొన్న మర్నాడే రోడ్డుప్రమాదం.. రియాలిటీ షో డ్యాన్సర్ మృతి
ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కొత్తకారు కొన్న మరుసటి రోజే రోడ్డు ప్రమాదంలో అతను మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కొత్తకారు కొన్న మరుసటి రోజే రోడ్డు ప్రమాదంలో అతను మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. డ్యాన్సర్ సుధీంద్ర (36) ఇటీవలే కొత్తకారును కొనుగోలు చేశాడు. ఆ కారును తన సోదరుడికి చూపించి తిరిగి వస్తున్న క్రమంలో.. బెంగళూరు సమీపంలోని హైవేపై కారులో ఏదో సమస్య ఉన్నట్లు భావించాడు. రోడ్డు పక్కకు కారును ఆపి పరిశీలిస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు అతన్ని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సుధీంద్రను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తేల్చిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా.. సుధీంద్ర మృతిపై కన్నడ సినీ, డ్యాన్స్ రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టాలెండెట్ డ్యాన్సర్ ను కోల్పోయామంటూ.. సంతాపం తెలిపారు.






