స్థానిక పోరులో రియల్, ఇసుక వ్యాపారుల జోరు.. వలస ఓటర్లకు భలే గిరాకీ

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్ధల పోరులో రియల్, ఇసుక వ్యాపారులదే జోరు సాగుతోంది. సర్పంచ్‌లుగా పోటీచేసి పేద, మధ్య తరగతి అభ్యర్ధులు..

స్థానిక పోరులో రియల్, ఇసుక వ్యాపారుల జోరు.. వలస ఓటర్లకు భలే గిరాకీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్ధల పోరులో రియల్, ఇసుక వ్యాపారులదే జోరు సాగుతోంది. సర్పంచ్‌లుగా పోటీచేసి పేద, మధ్య తరగతి అభ్యర్ధులు వణికిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యర్ధులను కంటిమీద కునుకు లేకుండా చూస్తున్నారు. ఓటర్లు ఆకట్టుకునేందుకు ఖరీదైన కండువాలు ధరించి దండాలు పెడుతూ తమకు వచ్చిన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఖాళీగా యువతను గ్రూపులుగా చేసి వారికి రోజు కూలీ, బోజనం, లిక్కర్​ఇస్తూ గల్లీ గల్లీ వదలకుండా ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. కళాకారుల ఆటలు, మైకుల మోతలు, డప్పుల దరువులతో పల్లెల వాతావరణం మార్చేశారు. ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రియల్​వ్యాపారుల చుట్టూ జనాల సందడి కనిపిస్తుంది. వారు గెలుసుడు దేవుడెరుగు కానీ అడ్డగోలు లిక్కర్​, నాన్​వెజ్​బోజనాలతో నిరుద్యోగ యువతకు రోజు పండగే. వారి దాటికి తట్టుకోలేక స్ధానికంగా రాజకీయ చేసిన నేతలు పోటీలో నిలబడలేక పోతున్నారు. రియల్, ఇసుక దందాలు చేసి అడ్డగోలు సంపాదించి ఎన్నికల్లో మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. వీరి ఆర్థిక బలం చూసి ఓటర్లు ఓటుకు బేరాలు పెట్టారు. ఓటర్ల బలహీనతలు పసిగట్టి రియల్​వ్యాపారులు, కుక్కర్లు, గడియార్లు, చీరలు పెద్ద మొత్తంలో పంపిణీ చేసేందుకు సిద్దమైన్నట్లు టాక్​వినిపిస్తోంది. రిజర్వేషన్లు ఉన్న చోట్ల కొంత మేరకు ప్రచారం ఉండగా, జనరల్​స్ధానాల్లో ఓటు ఖరీదు రూ. 3వేలకు పలుకుతుంది. నేటి నుంచి వార్డుల వారీగా డబ్బుల పంపిణీకి జాబితా సిద్దం చేసి పంపకాలు చేసేందుకు ప్లాన్​చేస్తున్నట్లు విపక్ష పార్టీల అభ్యర్ధులు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే అభ్యర్ధులపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ర్టంలోని 31 గ్రామీణ జిల్లాలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,574 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో మొదటి విడుత 4236 సర్పంచ్‌లు నోటిఫై చేయగా ఐదు చోట్ల నామినేషన్లు పడలేదు. 395 ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్‌లకు 13,217 మంది పోటీలో ఉన్నారు. 37,440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు దాఖాలు కాలేదు. 9331 వార్డు ఏకగ్రీవంగా మిగిలిన 27,960 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

సోషల్ మీడియా వార్​

బరిలో నిలిచిన అభ్యర్ధులకు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్​ప్రచారానికి వేదికలుగా మారాయి. పాటలతో వీడియోలు చేసిన ట్రోల్​చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు యువకులను ఏర్పాటు చేసి ప్రచారం తీరును ఎప్పటికప్పడు సోషల్​మీడియాలో పోస్టు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. స్ధానికంగా ఉండే వాట్సాప్​గ్రూపుల మొత్తం సర్పంచుల అభ్యర్ధుల ప్రచారం జరుగుతుంది. గ్రామాల్లో ఏదైనా యువతకు, మహిళలకు ఉపయోగపడే సందేశాలు పంపితే పట్టించుకునే వాడే లేడు. రాజకీయ నేతల ప్రచారానికి ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తామే పెట్టే సూక్తులు, గ్రామాల అభివృద్దికి ఎలాంటి నాయకుల ఎన్నుకోవాలని సూచిస్తే వాటిని ఎవరు చూడటం లేదని వాపోతున్నారు. డబ్బు, మద్యం ప్రలోభాలు పెట్టే వాటికి ఉన్న ఆదరణ ఇతర వాటికి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియల్, ఇసుక వ్యాపారులు రాజకీయాలను పూర్తిగా కలుషితం చేశారని మండిపడుతున్నారు.

వలస ఓటర్లు భలే గిరాకీ

గ్రామాల నుంచి పట్టణాలకు బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లతో నగరాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. వారికి మందు, బిర్యానీలతో విందులు ఇచ్చారు. రవాణా ఖర్చులతో పేరుతో ఓటుకు రూ. 4 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి గ్రామంలో ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో 30 శాతం ఓటర్లు ఇతర ప్రదేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. వారిని అభ్యర్ధుల అనుచరులు వెతికి వారి ద్వారా ఈసారి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్​కార్డులు, బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామని, నగరంలో ఉండి పోన్​చేస్తే అన్ని పనులు చక్కబెడుతామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు ఉండటంతో ముంబాయి. కర్నాటక, చెన్నై వలస వెళ్లిన వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అభ్యర్ధుల అనుచరులు చెబుతున్నారు.

Next Story