- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్లపై పోరాటానికి ఎందాకైనా సిద్ధం.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
గోదావరి జలాలపై కేంద్రంలోని బీజేపీ (BJP) వైఖరి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి జలాలపై కేంద్రంలోని బీజేపీ (BJP) వైఖరి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఇవాళ సిరిసిల్లలో పర్యటించిన ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) నీళ్లను తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉపసహరించుకోవాలని.. ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చిరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని ఎద్దేవా చేశారు.
ముందు గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబే (Chandrababu)నని.. తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్లపై పోరాటానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీళ్ల వాటాలు తేలాకే ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదని.. ఆయనకు తెలిసింది రియల్‌ఎస్టేట్, బ్లాక్ మెయిల్ దందాలేనని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ (KCR) రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలనే ఆకాంక్షించారని.. చంద్రబాబులా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కుట్రలు చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.






