- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశ్రామిక భూ బదలాయింపులపై విచారణకు సిద్ధం: BRSకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
తెలంగాణలో పారిశ్రామిక భూముల కేటాయింపులపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో జరిగిన పారిశ్రామిక భూముల బదలాయింపులు, టీడీఆర్ (TDR) పాలసీలపై విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి (2014) నేటి వరకు జరిగిన అన్ని భూ బదలాయింపులపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన హిల్ట్ పాలసీతో సహా అన్ని పారిశ్రామిక భూముల కేటాయింపులను విచారణ పరిధిలోకి తెస్తామన్నారు.
అదేవిధంగా నగరంలో టీడీఆర్ బాండ్ల జారీ, వాటి వినియోగంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి విచారణ కావాలో ప్రతిపక్ష నేతలు లేఖ రాయాలని.. సిట్టింగ్ జడ్జితోనా.. లేక సీబీఐతోనా? ఏ విచారణకైనా తాము సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. విచారణ జరిపించడంలో తమ ప్రభుత్వం వెనకాడితే తామే బహిరంగంగా క్షమాపణ చెబుతామని, నిజాయితీ ఉంటే విచారణకు కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.






