- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో రేవ్ పార్టీల జోరు.. మత్తులో చిత్తవుతున్న యువత
హైదరాబాద్ నగరంలో మళ్లీ రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో మళ్లీ రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. పార్టీలో సెలబ్రెటీలతో పాటు యువత అధికంగా పట్టుబడుతున్నారు. ఫాంహౌస్‌లు మొదలుకుని అపార్ట్‌మెంట్ల వరకు రేవ్ పార్టీలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదర్థాలను నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో యువత ఆకర్షితులవుతున్నారు. తాజాగా పెద్ద మంగళూరు రేవ్ పార్టీలో మైనర్లు పట్టుబడ్డారు. వీకెండ్‌లో ఈ తరహా పార్టీలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసు నిఘా పెట్టడం, స్థానికల సమచారంతో కొంత కట్టడి చేయగలుగుతున్నారు.
డ్రగ్స్.. అమ్మాయిలు..
కొండాపూర్‌లో జూలై 27న జరిగిన రేవ్ పార్టీలో ఏపీకి చెందిన 11 మందిని ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ ప్రాంతంలో వీకెండ్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్లలో మద్యం, డ్రగ్స్ వినియోగం, అమ్మాయిలతో డాన్స్ పార్టీలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్‌టీఎఫ్ టీం దాడులు నిర్వహించింది. నిందితుల వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్, ఆరు కార్లు, 11 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
51 మంది ఆఫ్రికన్లు
మొయినాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో ఆగస్ట్ 15న అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్న 51 మంది ఆఫ్రికన్స్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు. 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. ఎటువంటి అ నుమతి లేకుండా భారీ ఎత్తున్న మద్యం, డ్రగ్స్, హుక్కా ఏర్పాటు చేసుకున్నారు. వా రిపై కేసులు నమోదు చేయగా కొంత మంది పాస్‌పోర్ట్ వాలిడిటీ ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీకి డ్రగ్స్‌ను ఆఫ్రికన్ దేశస్తులు సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.
మొయినాబాద్‌లో మైనర్ల పార్టీ
మొయినాబాద్‌లోని పెద్ద మంగళారంలోని ఓక్స్ ఫాంహౌస్‌లో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మై నర్లు డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డారు. 50 మంది మైనర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్‌హౌస్ 9 ఎంఎం అనే పేజ్‌లో పరిచయమై పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ లో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరుగురుని ర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాంహౌస్‌లో 8 విదేశీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో 15,660 కేసులు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 వెల్లడించిన వివరాల్లో దేశ వ్యాప్తంగా 14 లక్షల కేసులు నార్కోటిక్ సైక్రియాటిక్ సబ్ స్టానిస్ (ఎన్డీపీఎస్) ట్రయల్ కేసులు ఉన్నాయి. 4 లక్షల కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. చార్జ్‌షీట్ వేసిన కేసుల సంఖ్య 3.56 లక్షల కేసులు, నిందితులకు శిక్ష పడిన కేసుల సంఖ్య 2.49 లక్షల కేసులు. 2023లో దేశ వ్యాప్తంగా 12 లక్షలకు పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 2023లో ఎన్డీపీఎస్ 15,660 కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. గుజరాత్, తమిళనాడు, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో 2023 జైలు శిక్ష విధించబడి జువైనల్ హోంకు తరలించిన వారిలో మైనర్లు 37 మంది ఉన్నారు. వారిలో హైదరాబాద్ పరిధిలో నలుగురు ఉన్నారు.






