రేపు రేషన్ దుకాణాలు బంద్

by Muthe.Rajitha |

రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ర్ట వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది.

రేపు రేషన్ దుకాణాలు బంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ర్ట వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తయిన ఇప్పటికీ హామీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావలసిన కమిషన్లను సైతం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వంటి కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో అండగానికి ఇచ్చిన రేషన్ డీలర్ల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఇచ్చే అరకొర కమిషన్ కేంద్ర రాష్ట్రాలు వేరువేరుగా ఇవ్వడంతో తాము ఆర్థికంగా చితికి పోతున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కమిషన్ ఇవ్వాలని కోరారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని అదే సమయంలో తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితిలో నిరసనలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.

Next Story