- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్డులు అర్హులకే.. స్పీడ్ పెంచిన మంత్రి పొన్నం.. కీలక ఆదేశాలు
నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను

దిశ , హైదరాబాద్ బ్యూరో : నూతన రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వెరిఫికేషన్, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రమంతటా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈనెల 25 నుండి ఆగస్టు 10 వరకు నియోజకవర్గాల వారీగా నూతన రేషన్ కార్డుల అందజేత ప్రక్రియ ఉంటుందని మంత్రి వివరించారు. హైదరాబాద్ జిల్లాల్లో ఉన్న 15 నియోజకవర్గాలకు 15 మంది నోడల్ అధికారులను నియమించి నూతన రేషన్ కార్డులు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని తెలిపారు.
జిల్లాలో నూతన రేషన్ కార్డుల కొరకు 2,19,717 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 92,842 దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని. ఇంకా 1,26,875 కార్డులు వెరిఫికేషన్ చేయవలసి ఉందని పేర్కొన్నారు. వెరిఫికేషన్ పూర్తయిన వాటిలో43,115 రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ నుండి 1100 మంది ఆర్పీలను వెరిఫికేషన్ ప్రక్రియకు వినియోగించుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులను మాత్రమే గుర్తించి కార్డులు అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి సమీక్ష నిర్వహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
స్లమ్ ఏరియాలలో వైద్య శిభిరాలు చేపట్టాలని , ప్రాంతాల వారీగా ఏర్పాటుచేసిన బృందాలచే ఫాగింగ్ చేపట్టాలని అన్నారు . ఈ కార్యక్రమంలో డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటి, జిల్లా టీవీ నివారణ అధికారి డాక్టర్ చల్లా దేవి, డిప్యూటీ డిఎం హెచ్ ఓ లు, వివిధ విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు






