- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ రోడ్ షోలో రప్ప రప్ప పోస్టర్లు
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక దగ్గరపడటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో జోష్ మరింత పెంచాయి. అటు సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో బిజీగా ఉండగా బీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక దగ్గరపడటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో జోష్ మరింత పెంచాయి. అటు సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో బిజీగా ఉండగా బీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ రోడ్ షోలో రప్పా రప్పా 2028 పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. పుష్ప సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ పోస్టర్‌ను ఓ వ్యక్తి ప్రదర్శించగా అందులో బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి పేరు ఉంది. అంతేకాకుండా కేసీఆర్ మరియు కేటీఆర్ ఫోటోలు ఉన్నాయి.
అయితే అప్పట్లో వైసీపీ ఇలాంటి పోస్టర్లనే ప్రదర్శించడంతో ఏపీలో దుమారం రేగింది. సినిమాలోని డైలాగులో రప్పా రప్పా నరుకుతాం.. అని ఉంటుంది. దీంతో వైసీపీ ఈ డైలాగును వాడటంతో టీడీపీ విమర్శలు కురిపించింది. వైసీపీ రౌడీల పార్టీ అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రదర్శనలు మంచివి కావని మండిపడింది. పోస్టర్లపై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి పోస్టర్లనే బీఆర్ఎస్ ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.






