తెలంగాణాలో మరో 11 జిల్లాల్లో రాపిడో సేవలు

by Muthe.Rajitha |

భారతదేశంలోని ప్రముఖ రైడ్-యాప్ రాపిడో, మరో 11 కొత్త నగరాల్లో బైక్, టాక్సీ, ఆటో సేవలను ప్రారంభించింది.

తెలంగాణాలో మరో 11 జిల్లాల్లో రాపిడో సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలోని ప్రముఖ రైడ్-యాప్ రాపిడో, మరో 11 కొత్త నగరాల్లో బైక్, టాక్సీ, ఆటో సేవలను ప్రారంభించింది.దీంతో తెలంగాణ అంతటా పూర్తి కవరేజీ సాధించింది. సిద్దిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రామగుండం, నిజామాబాద్, నల్గొండ, భువనగిరి, కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, కామారెడ్డిలలో సేవల విస్తరణ తో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తన యాప్-బేస్డ్ మొబిలిటీ సర్వీస్ అందిస్తోంది. భారతదేశం అంతటా 500 నగరాలను చేరుకోవాలనే రాపిడో లక్ష్యానికి చేరువైంది. ఇండియాలో రాపిడో ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని.. ఈ విస్తరణ ద్వారా, కంపెనీ మరో లక్ష కొత్త ఉద్యోగ అవకాశాలను తేనుందని అన్నారు కంపెనీ ప్రతినిధులు.

ప్రస్తుతం రోజుకు దాదాపు 4 మిలియన్ల రైడ్‌లను అందిస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ తెలంగాణలో రాపిడో సేవలను ప్రవేశపెట్టడం పట్ల తాము సంతోషిస్తున్నామనీ, సురక్షిత, సౌకర్యవంతమైన రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యం అన్నారు.దీనివల్ల వందలాది మంది స్థానిక యువతకు జీవనోపాధి అవకాశాలు లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది ” అని అన్నారు.

Next Story