బండ్లగూడలో జోనల్.. సర్కిల్ కార్యాలయాలు

by Thanuru Gopichand |

బండ్లగూడలో రాజేంద్రనగర్ జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

బండ్లగూడలో జోనల్.. సర్కిల్ కార్యాలయాలు
X

దిశ, రాజేంద్రనగర్ / గండిపేట : బండ్లగూడలో రాజేంద్రనగర్ జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కిస్మత్ పూర్లో ఉన్న మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి భవనం మొత్తం ఆయనకు చూపించి వివరాలు తెలియజేశారు. బండ్లగూడలో సువిశాలంగా ఉన్న మున్సిపల్ భవనంలో జోనల్ కార్యాలయం, సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయానికి వచ్చిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి శనివారం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రాజేంద్రనగర్ లో ఉన్న భవనం చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో ఉన్నతాధికారులు బండ్లగూడలో జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపారు.

రాజేంద్రనగర్ లో అత్తాపూర్ సర్కిల్

అత్తాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని పాత రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ ను రెండు సర్కిల్ లుగా విభజించారు. అందులో అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లుగా పేర్లు చేర్చారు. రాజేంద్రనగర్ సర్కిల్లోకి కొత్తగా హైదర్శ కోట్, బండ్లగూడ, కిస్మత్ పూర్ తో పాటు రాజేంద్రనగర్ డివిజన్ ను కలిపారు. అత్తాపూర్ సర్కిల్లోకి కాటేదాన్ మైలార్ దేవ్ పల్లి, శాస్త్రి పురం, సులేమాన్ నగర్, అత్తాపూర్, హైదర్ గూడ డివిజన్లను చేర్చారు.

నూతనంగా ఏర్పడ్డ అత్తాపూర్ సర్కిల్ కార్యాలయం కోసం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయానికి రంగులు వేయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాజేంద్రనగర్ లో ఉన్న సర్కిల్ కార్యాలయంలోనే అత్తాపూర్ సర్కిల్ కార్యాలయం కొనసాగనుంది. పేరుకు రాజేంద్రనగర్ సర్కిల్ అయినప్పటికీ అధికారులు కిస్మత్ పూర్ నుంచి కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది.

రాజేంద్రనగర్ జోన్ పరిధిలోకి...

చార్మినార్ జోన్ లో నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, బహదూర్ పురా సర్కిల్ లను తొలగించి రాజేంద్రనగర్ జోన్ లోకి కలిపారు. నూతనంగా ఏర్పడిన రాజేంద్రనగర్ జోన్ లోకి రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, బహదూర్ పురా, జంగం మెట్ సర్కిళ్ల తో రాజేంద్రనగర్ జోన్ ను ఏర్పాటు చేశారు.

Next Story