మూసీ వరదలో యువకుడు గల్లంతు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

by Chintha Aamani |

హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం పెరిగిపోయింది.

మూసీ వరదలో యువకుడు గల్లంతు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
X

దిశ, రాజేంద్రనగర్ : హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం పెరిగిపోయింది. గురువారం అధికారులు 9 గేట్లను తెరిచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసి లోకి హిమాయత్ సాగర్ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు ఉదయం 12 గంటలకు ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న మూసిలో చిక్కుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

ఈ విషయం అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, హైడ్రా సిబ్బంది హైదర్ గూడ కు చేరుకున్నారు. ఇద్దరు యువకులు తీసిన వీడియో కాస్త వైరల్ కావడంతో అత్తాపూర్ మూసీ పరివాహక ప్రాంతానికి ప్రజలు తరలివచ్చారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎవరూ లేరని చెట్టుకొమ్మలు నీటిపై తేలియాడుతున్నాయని ధృవీకరించారు. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తున్నారు.

Next Story