తాండూరులో 'చేతబడి' కలకలం !

by Taduka Kalyani |

కూతురు ప్రేమ పెటాకులు కావాలని ఓ కన్నతల్లి సొంత కూతురుపైనే చేతబడి చేయించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్రనగర్ లో చోటు చేసుకున్న సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది.

తాండూరులో చేతబడి కలకలం !
X

దిశ, తాండూరు: కూతురు ప్రేమ పెటాకులు కావాలని ఓ కన్నతల్లి సొంత కూతురుపైనే చేతబడి చేయించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్రనగర్ లో చోటు చేసుకున్న సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే కూతురు ప్రేమ పెటాకులు కావాలని తల్లి తాండూరు పట్టణానికి చెందిన మంత్రగాడిని సంప్రదించింది. గురువారం అర్ధరాత్రి ఇంద్రనగర్ కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేస్తుండగా కాలనీవాసులు చూశారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు కొందరు మంత్రగాడికి దేహశుద్ధి చేశారు. అమ్మాయికి పెళ్లి కావడం లేదని, ఇద్దరు ఫోటోలు తీసుకువచ్చి వారిద్దరూ మాట్లాడకుండా చేయాలని తమ దగ్గరకు వస్తే ఏమో చేస్తున్నానని తలా..తోక లేని సమాధానాలు తెలిపాడు. దీంతో ఈ సంఘటన తాండూరు పోలీస్ స్టేషన్ కు చేరినట్లు సమాచారం. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాల పేరుతో ఇలా వ్యవహరిస్తున్న తీరు తాండూరులో తీవ్ర కలకలం రేపింది.

Next Story