- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పటేల్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలేంటీ..?
బీఆర్ఎస్ యువనేత, వీరశైవ సమాజం నాయకులు పటేల్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలేంటీ..?? అప్పులు ఇచ్చిన వ్యక్తుల వేధింపులే కారణమా..?

దిశ, తాండూరు : బీఆర్ఎస్ యువ నేత, వీరశైవ సమాజం నాయకులు పటేల్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలేంటీ..?? అప్పులు ఇచ్చిన వ్యక్తుల వేధింపులే కారణమా..? గత కొద్ది రోజులుగా ఓ కోర్టు కేసుకు సంబంధించి రాజకీయ పరంగా ఒత్తిడి కారణమా..? ఆత్మహత్యకు ముందు మూడు పేజీల సూసైడ్ నోట్ లో ఏముందీ..? అని తాండూరులో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. స్థానికులుతెలిపిన వివరాల ప్రకారం..పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు, ఇందూరు గ్రామ మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ (42) ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే తాండూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
అంతిమయాత్రలో ఉద్రిక్తత..!
హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ మృతదేహం పోస్టుమార్టం కోసం తాండూరుకు తీసుకొచ్చారు. తాండూరుకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొని "పటేల్ ప్రవీణ్ అమర్ రహే" అంటూ నినాదాలు చేస్తూ అంబులెన్స్ వెంట వందలాది మంది ర్యాలీగా వెళుతున్న క్రమంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పటేల్ ప్రవీణ్ మృతికి కారకులు అయిన వారిని గుర్తించాలని, వారిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
రాజకీయ నేతల ఒత్తిడి అంటూ పైలెట్ ఫైర్..!
ఈ విషయంపై పటేల్ ప్రవీణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగిందని రోహిత్ రెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా పటేల్ ప్రవీణ్ తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్నట్లు వారు తెలిపారని అన్నారు. అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి తీవ్ర వత్తిడి వచ్చినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని అన్నారు. 10 శాతం వత్తిడికి అప్పులు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బును రాబట్టుకునేందుకు పటేల్ ప్రవీణ్ పై వత్తిడి తేవడం ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు వివరించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు.మరోవైపు గత కొద్ది రోజులుగా ఒక కోర్టు కేసుకు సంబంధించి రాజకీయ పరంగా కూడా పటేల్ ప్రవీణ్ పై వత్తిడి కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించారు. నిత్యం ఫోన్లు చేయడం..కొందరు నేతలు ఇంటికి రావడం చేస్తున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని అన్నారు. కోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని రాజకీయ నేతలు వత్తిడి తీసుకువచ్చారంటూ పైలెట్ ఫైర్ అయ్యారు.
నా భర్త రాముడు.. నేను సీత..
మా కుటుంబంలో ఎలాంటి వేధింపులు లేవు.. నా భర్త రాముడు.. నేను సీత.. నా పిల్లలు లక్ష్మణులు లాగా అంటూ కన్నీటి శ్లోకంతో మృతుడి భార్య తెలిపారు. మా కుటుంబం పై ఓరువలేక, నా భర్త పై మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకుకు తండ్రిని తేవాలాంటూ.. మీకు కూడా కుటుంబం ఉంది అంటూ.. మండిపడ్డారు. అంతక్రియల అయిన తర్వాత ఒకరోజు ఆత్మహత్యకు గల కారణాలన్నీ వివరిస్తానని మృతుడి భార్య చెప్పారు.ఓ పాత్రికేయుడు మూడు పేజీల సూసైడ్ నోట్ ఉంది అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ సూసైడ్ నోట్ లో ఏముందో..? అని తాండూరులో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది.
రాజకీయ నేతలు సంతాపం
పటేల్ ప్రవీణ్ భౌతికకాయానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వేరు వేరుగా సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రవీణ్ మరణం నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరికొందరు ముఖ్య నాయకులు కూడా ప్రవీణ్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.






