- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులకు తాళాలు..గ్రామాల్లోనే చెత్త!
గ్రామపంచాయతీలు దుర్గంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులు నిలిచిపోయి పంచాయతీల నిర్వహణ కష్టంగా మారుతోంది. మొన్నటి వరకు ఉన్నతాధికారుల

దిశ, రంగారెడ్డి బ్యూరో : గ్రామపంచాయతీలు దుర్గంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులు నిలిచిపోయి పంచాయతీల నిర్వహణ కష్టంగా మారుతోంది. మొన్నటి వరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్యదర్శులు అప్పోసప్పో చేసి మేజర్పనులకు ఖర్చు చేశారు. చాలా రోజులుగా ఖర్చు చేస్తున్న నగదు ఇవ్వాలని కార్యదర్శులు ఉన్నతాధికారులను అడిగితే ఎవరు పెట్టుకోమని చెప్పారని సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన కార్యదర్శులు గ్రామాల్లో చెత్త సేకరణ చేసే ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను వాడకుండా ఉండేందుకు కంకణం కట్టుకొని సంబంధిత మండలాధికారులకు తాళాలను అప్పగించినట్లు తెలుస్తోంది.
నిధులు నిల్...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేశారు. పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనతో 15 నెలలుగా కొనసాగుతుంది. దీంతో ప్రత్యేకాధికారులు గ్రామాలకు పేరుకు మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ ఆ గ్రామాల పరిస్థితిని అటువైపు తొంగి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ సమస్య వచ్చిన పంచాయతీ కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి పెట్టి పనిచేయిస్తున్నారనే వాధన వినిపిస్తుంది. జిల్లా పంచాయతీ అధికారులు మాత్రం కార్యదర్శులకు ఏకంగా ఎవరు డబ్బులు పెట్టుకుని పని చేయించమని చేబుతున్నారనే విమర్శలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈవిధంగా పంచాయతీల్లో సమస్యలు పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆది మొత్తం తడిసిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యం మెరుగుపర్చాలనే ఆలోచన ఎవరికీ లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 602, వికారాబాద్ జిల్లాలోని 405 గ్రామాల్లో నిర్వహణ పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు ‘దిశ’ చేపట్టిన పరిశీలనతో అర్ధమైతుంది.
సీజనల్ వ్యాధులకు చర్యలేవీ...?
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు అధికమైయ్యే పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తోంది. రోడ్లపై చెత్త చెదారం పేరుకుపోవడంతో తడిసి దోమలు, ఈగలు విజృంభిస్తాయి. దీంతో చిన్నారులకు తొందరగా వైరల్ విష జ్వరాలతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. అంతేగాక 65ఏండ్లకు పైబడిన వృద్ధులకు వ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గ్రామాల్లో చెత్తను తొలగించడంతో పాటు మురుగు బయటకు పంపి బ్లీచింగ్ చల్లాలి. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆదేశాలిస్తున్నా అమలయ్యే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భయంతో చేతి నుంచి నగదు పెట్టేందుకు కార్యదర్శులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి వెచ్చించిన నగదును చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఈవిషయాలన్ని దృష్టిలో పెట్టుకోని ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుని మేల్కొంటున్నారు. ప్రజలు ఏవిధంగా మేల్కొనాలో తెలుసుకోని ఇకనైనా నడుచుకోవాల్సిన బాధ్యతను పరిస్థితులు కల్పిస్తున్నాయి.
ఇదీ గ్రామాల్లో పరిస్థితి...
– యాచారం మండలంలో 24 గ్రామపంచాయతీ ఉన్నాయి.. ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి మరికొందరు దాతలను ఆశ్రయించి చెత్త సేకరణకు ట్రాక్టర్ డీజిల్‌కు ఖర్చు చేస్తున్నారు. యాచారంలో ఇండ్ల మధ్యన చెత్త పట్టించుకోరా.. దిశలో కథనం ప్రచురితమైతే అప్పు చేసి టాక్టర్ రిపేరు చేయించినట్లు పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్య తెలిపారు.
– తలకొండపల్లి మండలంలోని 32 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు నిధులు లేక పంచాయితీ కార్యదర్శులందరూ స్థానిక ఎంపీడీవోలకు ట్రాక్టర్ల తాళాలను ఇచ్చారు. ప్రస్తుతం ట్రాక్టర్లు నిలిచిపోవడంతో చెత్త మొత్తం గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు.
–ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా చెత్త సేకరించే ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు గత కొన్ని నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి. దీంతో ట్రాక్టర్ నిర్వహణ చేయలేమని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల తాళాలు ఎంపీఓకు రెండు రోజుల క్రితం అందించారు. ప్రస్తుతం గ్రామాల్లో చెత్త సేకరించక కుప్పలుగా పేరుకుపోయాయి.
–కేశంపేట మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు గాను డీజిల్ డబ్బులు లేక రెండు రోజులుగా చెత్త సేకరణ జరగడం లేదు. ట్రాక్టర్‌లో పోయించిన డీజిల్ ఉన్న గ్రామాల్లో మాత్రం చెత్త సేకరణ జరిగింది. పంచాయితీ కార్యదర్శులు గ్రామపంచాయతీలలో ఆర్థిక పనులను నిలిపివేశారు.
–మహేశ్వరం మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మహేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సమస్య ఎక్కువగా ఉంది. మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయం నుంచి ఉప్పుగడ్డ తండాకు వెళ్ళే ప్రధాన రహదారి ప్రక్కనే నిత్యం చెత్త వేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్ళే వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
–మాడ్గుల మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ట్రాక్టర్‌తో చెత్త గ్రామాల నుండి తరలించలేక కార్యదర్శులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లక్ష నుండి 2లక్షల వరకు సొంతంగా ఖర్చు చేస్తూ చెత్తను తరలిస్తున్నట్లు చెప్పారు.
–కొత్తూరు మండలంలో 12 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. చెత్త ట్రాక్టర్ నిర్వహణ బాగానే ఉన్నా... తడి పొడి చెత్తను వేరు చేయడం లేదు. ఆ చెత్తను కాలుస్తున్నారు.
–పెద్దెముల్ మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోని పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. స్పెషల్ ఆఫీసర్లు నామా మాత్రంగానే ఉన్నారు. చిన్న చిన్న పనులకు పంచాయితీ కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టీ పనులు చేపిస్తున్నారు. మరి కొందరు పంచాయితీ కార్యదర్శులు చేతులేస్తున్నారు, పలు గ్రామాల్లో చెత్త ట్రాక్టర్ల సేవలు నిలిచిపోయాయి, వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
–బొంరాస్పేట్ మండలంలో 47 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పరిపాలన ప్రభుత్వ చెత్త ట్రాక్టర్లు సరైన నిర్వహణ లేక రిపేర్ కి వస్తున్నాయి.
–మర్పల్లి మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలో చెత్త ట్రాక్టర్ నిర్వహణ సక్రమంగానే ఉంది.. ఎక్కువగా చిన్న పంచాయతీల్లో డబ్బులు లేక వృథాగా పడి ఉన్నాయి.






