- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్ షాపుల వద్ద పార్కు చేసిన వాహనాలు చోరీ
దిశ, మీర్ పేట్: వైన్ షాపులు,పార్కుల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న

X
దిశ, మీర్ పేట్: వైన్ షాపులు,పార్కుల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మీర్ పేట్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..తుర్కయాంజాల్ కు చెందిన కోపులురి శ్రీను( 39) వృత్తి రీత్యా మేస్త్రి చెడు అలవాట్లకు అలవాటు పడి వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మంద మల్లమ్మ కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు చిక్కాడు. పోలీసులు తమ శైలిలో విచారించగా వైన్స్ షాపులు, పార్కు ల వద్ద పార్కు చేసిన మరో 17 వాహనాలను చోరీ చేసినట్లు నేరం అంగీకరించడంతో వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Next Story






