- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వట్టి నాగులపల్లి పరిసరాల్లో అక్రమ మైనింగ్ పై తక్షణ చర్యలు అవసరం
వట్టి నాగులపల్లి పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై సిటిజన్ కౌన్సిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రెసిడెంట్ బొమ్మ ఉపేంద్ర నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, గండిపేట : వట్టి నాగులపల్లి పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై సిటిజన్ కౌన్సిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రెసిడెంట్ బొమ్మ ఉపేంద్ర నాథ్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా ఇటీవల చేపట్టిన చర్యలు సరైనవే అయినప్పటికీ, అవి సమస్య పూర్తి స్థాయిని పరిష్కరించలేవని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడం, సహజ వనరుల నాశనం, ప్రభుత్వానికి సీనరేజ్ ఆదాయంలో భారీ నష్టానికి దారితీస్తుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ది సిటిజన్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.
అనుమతి లేని తవ్వకాలపై సీబీ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సీనరేజ్ నష్టంపై 10 రెట్ల వరకు కఠినమైన జరిమానాలు విధించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలని కోరారు. మళ్లీ ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా యంత్రాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ రక్షణ, బాధ్యతను నిర్ధారించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు ఉపేంద్ర నాథ్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో ఉదాసీనతగా వ్యవహరించొద్దని తెలిపారు.






