- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫర్టిలైజర్ యాప్ తో యూరియా బుకింగ్ : ఏవో నిశాంత్ కుమార్
రైతులకు అవసరమైన యూరియాను నేటి నుంచి ఫర్టిలైజర్ యాప్ లో బుక్ చేసుకుని ఆన్లైన్ విధానంలో పొందాలని ఫరూఖ్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు.

దిశ, షాద్ నగర్ : రైతులకు అవసరమైన యూరియాను నేటి నుంచి ఫర్టిలైజర్ యాప్ లో బుక్ చేసుకుని ఆన్లైన్ విధానంలో పొందాలని ఫరూఖ్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద స్మార్ట్ ఫోన్ల లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తమకు అవసరమైన ఎరువులను బుక్ చేసుకుని పొందవచ్చని తెలిపారు. మండలంలోని ఆదికృత రిటైలర్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో యూరియా స్టాక్ ను ఈ యాప్ లో రైతులు పరిశీలించవచ్చని అన్నారు. యూరియా సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించదమే ఈ విధానం ముఖ్య లక్ష్యం అని తెలిపారు. పట్టా భూ యజమానులు, నాన్ పట్టా రైతులు, కౌలుదారులు ఈ యాప్ లో ఎరువులను బుక్ చేసుకుని పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు తాము పంట సాగు చేసే విస్తీర్ణం ఒకసారి నమోదు చేశాక మార్చేందుకు వీలు ఉండదని, యువర్ బుకింగ్ 24 గంటల పాటు మాత్రమే ఆక్టివ్ గా ఉంటుందని తెలిపారు. రైతులకు యూరియా బుకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే స్థానిక పంచాయతీ సెక్రెటరీల, జిపిఓల, వ్యవసాయ విస్తరణ అధికారుల సహాయాన్ని తీసుకోవాలని ఏవో నిశాంత్ కుమార్ తెలిపారు.






