- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలు పాటించండి : ప్రమాదాలను నివారించండి
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలని షాద్ నగర్ రవాణా శాఖ అధికారి వాసు అన్నారు.

దిశ, షాద్ నగర్ : నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలని షాద్ నగర్ రవాణా శాఖ అధికారి వాసు అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ (కుంట బడి) పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేస్తున్న సమయంలో సీటు బెల్టులను, హెల్మెట్ లను ధరించాలని తెలిపారు. ప్రయాణాలు చేసే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, వాహన పత్రాలను తీసుకెళ్లాలని అన్నారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ వినియోగిస్తూ, నిద్ర లేమితో వాహనాలను నడపరాదని పేర్కొన్నారు. రోడ్డు పై నడిచే సమయంలో సైతం ట్రాఫిక్ నిబంధనాలను ఖచ్చితంగా పాటించాలని, మైనర్లు వాహనాల నడపడం చట్టరీత్యా నేరమని రవాణా శాఖ అధికారి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల విద్యాశాఖ అధికారి మనోహర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






